News February 2, 2025
క్రికెట్ పోటీల్లో గద్వాల రాణించాలి: కలెక్టర్

గద్వాల జిల్లా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రం, దేశ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో షేర్ అలీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని సూచించారు.
Similar News
News February 8, 2025
దక్షిణ భారతదేశంలోనే నాలుగు ధ్వజ స్తంభాలు కలిగిన దివ్య క్షేత్రం

తెనాలి షరాఫ్ బజారులోని శ్రీసువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే 4 ధ్వజ స్తంభాలు కలిగిన ఏకైక ఆలయంగా విరజిల్లుతోంది. 5 ముఖాలతో స్వామి పూజలందుకుంటున్నారు. 1803లో భాగవతుల అన్నయ్య కుటుంబీకులు ఆలయ నిర్మాణం చేయగా నాటి నుంచి ఈక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతోంది. గర్భాలయంలో స్వామివారి 9 అవతార రూపాలు దర్శనమిస్తాయి. నేటి నుంచి వారం పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
News February 8, 2025
సూర్యాపేట: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి NLG జిల్లా 2వ అదనపు కోర్టు జడ్జి రోజారమణి గురువారం జీవిత ఖైదు విధించారు. చివ్వెల(M)కి చెందిన విజయకు కర్నూలు జిల్లాకు చెందిన మూజువర్ నూర్ మహ్మద్‌తో పరిచయమైంది. వారు కొంతకాలం సహజీవనం చేయగా ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన మహ్మద్ 2014జూన్6న కనగల్(M) పర్వతగిరి వద్ద ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.
News February 8, 2025
JRG: 8వ తరగతి బాలికపై అత్యాచారం

జంగారెడ్డిగూడెం(M) ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI జబీర్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 5న ఇంటికి వెళ్తుండగా శ్యామ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో వారు నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.