News March 24, 2025

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ

image

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ హెచ్చరించారు. వారిపై రౌడీ షీట్స్ తెరవడానికి కూడా వెనుకాడబోమన్నారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే ఉపేక్షించబోమని, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోమవారం జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బెట్టింగ్ సమస్యల గురించి విద్యార్థులకు, యువతకు విస్తృత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు.

Similar News

News October 30, 2025

ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

image

ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News October 30, 2025

ANU: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు అందించాలని సూచించారు.

News October 30, 2025

నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్: పీవో

image

సీతంపేటలోని NTR అడ్వెంచర్ పార్కులో నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథం గురువారం తెలిపారు. ఈ ఈవెంట్‌లో హార్ట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అదే రోజు జన జాతీయ గౌరవ దివస్‌ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సంధ్యారాణి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.