News March 23, 2025
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు: అన్నమయ్య SP

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఎస్పీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో మ్యాచ్‌ను చూసి ఆనందించాలన్నారు. అంతకు మించి బెట్టింగులకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
Similar News
News November 14, 2025
సంగారెడ్డి: జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు

సంగారెడ్డి జిల్లా వైద్య అధికారిగా డాక్టర్ వసంత రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల నుంచి బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు.
News November 14, 2025
తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే?

జుట్టు నల్లగా ఉండటానికి కారణమయ్యే మెలనోసైట్లు తగ్గటానికి విటమిన్ డి లోపం, మానసిక ఒత్తిడి, సిగరెట్లు తాగటం, ఇతరులు కాల్చిన సిగరెట్ల పొగ పీల్చటం, వాయు కాలుష్యం, నిద్రలేమి, షిఫ్ట్ ఉద్యోగాలు వంటివి కారణమవుతాయంటున్నారు నిపుణులు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మెలటోనిన్ బాగా తయారవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు తెల్లబడటాన్ని ఆపొచ్చు. మరీ అవసరమైతే వైద్యుల సూచనతో సప్లిమెంట్లు వాడొచ్చు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: జనసేన మద్దతు.. అయినా BJPకి డిపాజిట్ గల్లంతు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ గల్లంతవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఏపీలో NDA కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇక్కడి ఏపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన.. BJPకి మద్దతు తెలిపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాగా ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మీటింగ్‌లు, ర్యాలీలలో TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణ TDP నేతలు కాంగ్రెస్ వైపు నిలిచారనే చర్చ కూడా కొనసాగింది.


