News December 22, 2024

క్రిస్టియన్లపై బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుంది: వరంగల్ ఎంపీ

image

దేశంలో క్రిస్టియన్లపై బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎంపీ కావ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాంతియుతంగా ఉండే క్రిస్టియన్లపై దాడులు చేస్తున్నారని, మణిపూర్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహారిస్తుందని అన్నారు.

Similar News

News December 22, 2024

దేశ ప్రధానిగా సేవలందించడం మనందరికీ గర్వకారణం: మంత్రి సురేఖ

image

పీవీ నర్సింహారావును మించిన మేధోసంపన్నుడు, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు మరొకరు లేరని మంత్రి కొండా సురేఖ అన్నారు. పివి నర్సింహారావు 20వ వర్ధంతి(డిసెంబర్-23) సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డ అయిన పివి నర్సింహారావు దేశ ప్రధానిగా సేవలందించడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

News December 22, 2024

రేపు ప్రారంభం కానున్న వరంగల్ మార్కెట్ 

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News December 22, 2024

వరంగల్: భర్త కూర బాగాలేదన్నడని భార్య ఆత్మహత్యాయత్నం

image

భర్త కూర మంచిగా లేదు అన్నందుకు ఓ భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ స్టేషన్‌ రోడ్ సమీపంలో నివాసముండే సర్వారి స్వర్ణముఖి తన భర్త కూర బాగా లేదన్నాడని ఆత్మహత్యకు యత్నించింది. టార్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు.