News December 25, 2024

క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

image

రేపు క్రిస్మస్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవా, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు. ఏసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.

Similar News

News January 24, 2025

ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం: ఇలా త్రిపాఠి

image

ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద నుంచి విద్యార్దినులు, మహిళలుతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా బేటి బచావో బేటి పడావో పై ఏర్పాటుచేసిన పోస్టర్‌ను విడుదల చేశారు.

News January 24, 2025

నల్గొండ జిల్లాలో గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

image

నల్గొండ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 9:30 గంటలకు బాల బాలికల సాంస్కృతిక విన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శకటాల ప్రదర్శన జరుగుతుందని అధికారులు తెలిపారు.

News January 24, 2025

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన DSP 

image

ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు చెరువుగట్టులో శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ DSP కె. శివరాంరెడ్డి నార్కట్‌పల్లి సీఐ నాగరాజుతో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయ పరిసర ప్రాంతాలు, భక్తుల సౌకర్యం, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి పలు సూచనలు చేశారు.  దేవాలయ EO నవీన్ కుమార్ నార్కెట్ పల్లి పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.