News December 25, 2024
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్
క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలాషించారు.
Similar News
News January 25, 2025
నిజామాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది
నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటరు దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
News January 25, 2025
బాల్కొండ: ఎన్నికల కోసమే రైతుబంధు: MLA
ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. BRS ఆధ్వర్యంలో సాగు, సంక్షేమ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, MLCలు యాదవరెడ్డి, కోటిరెడ్డి, మెండోరా మండలం బుస్సాపూర్‌లో రైతులతో శనివారం సమావేశమయ్యారు.
News January 25, 2025
NZB: వృద్ధులను అభినందించిన కలెక్టర్
ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూర్ ఇందిరా, అవధూత భూమయ్య, మెరుగు ఒడ్డెమ్మ, అంకం సుశీల, వై.నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఐడీ కార్డులను అందజేశారు.