News January 24, 2025
క్రీడల అభివృద్ధి కోసం త్వరలోనే సమావేశం: కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం అన్ని వర్గాలతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జేఎన్ఎస్ స్టేడియాన్ని కలెక్టర్ ప్రావీణ్య గురువారం సందర్శించారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, జిమ్నాస్టిక్ హాల్ను పరిశీలించి నూతనంగా నిర్మిస్తున్న రెజ్లింగ్, కబడ్డీ ఇండోర్ స్టేడియం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. క్రీడాకారుల టాయిలెట్ల ఏర్పాటు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 24, 2025
SRPT: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

సూర్యాపేట జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు.
News November 24, 2025
విశాఖ: మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు!

ట్రాఫిక్ చలాన్లను సులువుగా చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో mPARIVAHAN appలో చలాన్లు చెల్లించేవారు. ప్రస్తుతం PhonePay యాప్లోనూ eChallan & icon enable చేశారు. యాప్లో eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి.. వాహన నెంబర్ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.
News November 24, 2025
వరంగల్: నిత్య పెళ్లికూతురుపై కేసు నమోదు..!

నిత్య పెళ్లికూతురుపై <<18370111>>కేసు నమోదు<<>> చేసినట్లు వరంగల్(D) పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు. చౌటపల్లికి చెందిన దేవేందర్ రావు పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపల్లి అరుణ-రామారావులను సంప్రదించారు. దీంతో వారు నిమిషకవి ఇందిర అనే మహిళను చూపించగా వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెకు ఇంతకుముందే వివాహమై కూతురు ఉన్నవిషయం తెలుసుకొని ఫిర్యాదు చేయడంతో ఇందిర, తల్లి లక్ష్మి, అరుణ, రామారావుపై కేసు నమోదు చేశారు.


