News January 23, 2025
క్రీడల అభివృద్ధి కోసం త్వరలోనే సమావేశం: కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం అన్ని వర్గాలతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జేఎన్ఎస్ స్టేడియాన్ని కలెక్టర్ ప్రావీణ్య గురువారం సందర్శించారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, జిమ్నాస్టిక్ హాల్‌ను పరిశీలించి నూతనంగా నిర్మిస్తున్న రెజ్లింగ్, కబడ్డీ ఇండోర్ స్టేడియం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. క్రీడాకారుల టాయిలెట్ల ఏర్పాటు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 14, 2025
దెందులూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

వట్లూరులో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డ్రైవర్ సుధీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై గురువారం కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. అందులో అబ్బయ్య చౌదరిని A1 గా పెట్టారు. చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి వివాదం ముదురుతోంది.
News February 14, 2025
విశ్వక్‌సేన్ ‘లైలా’ పబ్లిక్ టాక్

విడుదలకు ముందే రాజకీయ వివాదాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ‘లైలా’ సినిమా ప్రీమియర్ షోలు USలో ప్రారంభమయ్యాయి. సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టారని, సినిమా అంతా వన్ మ్యాన్ షో అని ప్రశంసిస్తున్నారు. అయితే స్టోరీ ఔట్‌డేటెడ్ అని, ఇంట్రెస్టింగ్ సీన్లు లేవని కొందరు పెదవి విరుస్తున్నారు. పూర్తి రివ్యూ, రేటింగ్ మరికొన్ని గంటల్లో..
News February 14, 2025
భద్రాద్రి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు

ఇతర రాష్ట్రాల్లో కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాద్రి జిల్లాకు ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతి అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అశ్వరావుపేట, దమ్మపేట మండలం అల్లిపల్లి, చర్ల మండలం తేగడ వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.