News March 12, 2025

క్రీడాకారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు పంపిణీ

image

అల్లూరి జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా నుంచి జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఆర్చరీ, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, కబడ్డీ పోటీల్లో 15 మంది పాల్గొన్నారు. దీనిలో హ్యాండ్ బాల్ 2వ స్థానం సాధించిన గౌరీ శంకర్, డిస్కస్ త్రోలో 3వ స్థానం సాధించిన చంద్రశేఖర్ నాయుడును కలెక్టర్ అభినందించారు.

Similar News

News September 16, 2025

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి: జేసీ

image

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1,56,505 ఎకరాల్లో వరి సాగైందని, 4.34 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు ప్రక్రియపై ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు.

News September 16, 2025

ఒక్కసారిగా ‘టమాటా’ విలన్ అయ్యాడు!

image

వారం క్రితం కిలో రూ.40 వరకు పలికిన టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.5-8, 20 కిలోల గంప కేవలం రూ.150 మాత్రమే పలుకుతుండటంతో రవాణా ఖర్చులకే ఆ డబ్బు సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ డివిజన్ పరిధిలో 5,500 హెక్టార్లలో పంట సాగు కాగా దిగుబడులు భారీగా వస్తున్నాయి. ధరలు మాత్రం లేకపోవడంతో కొందరు మార్కెట్‌లో, మరికొందరు రోడ్డు గట్టున టమాటాలను వదిలి వెళ్తున్నారు.

News September 16, 2025

మైదుకూరు: ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

image

మైదుకూరు పట్టణం సాయినాథపురం గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. రమేశ్ తన ఇంటి అవసరాల కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణం తీసుకున్నాడు. రుణాలు చెల్లించకపోవడంతో కంపెనీ సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యనికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.