News March 12, 2025
క్రీడాకారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు పంపిణీ

అల్లూరి జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా నుంచి జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఆర్చరీ, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, కబడ్డీ పోటీల్లో 15 మంది పాల్గొన్నారు. దీనిలో హ్యాండ్ బాల్ 2వ స్థానం సాధించిన గౌరీ శంకర్, డిస్కస్ త్రోలో 3వ స్థానం సాధించిన చంద్రశేఖర్ నాయుడును కలెక్టర్ అభినందించారు.
Similar News
News March 15, 2025
తూ.గో: నేటి నుంచి ఒంటిపూట బడులు

నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని డీవీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 1.15గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మిగతా పాఠశాలల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News March 15, 2025
ATP: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని నాయకునిపల్లి గ్రామానికి చెందిన మునిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్‌కు ఉన్న మెయిన్ లైన్ నుంచి వచ్చే హెడ్ ఫీజులు కట్ కావడంతో వేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విద్యుత్తు ప్రవహించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 15, 2025
యాదాద్రి: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్ స్కూల్స్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. అటు ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.