News January 4, 2025

క్రీడాకారులను అభినందించిన ADB కలెక్టర్

image

సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా అభినందించారు. వివిధ ఆటల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని 43 మెడల్స్ సాధించి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులను శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అభినందించారు. మెడల్స్, ప్రశాంత పత్రాలు అందజేశారు. డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు ఉన్నారు.

Similar News

News November 14, 2025

పోషకాహారం లక్ష్యంగా ముందుకు: కలెక్టర్ రాజర్షి షా

image

విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన న్యూట్రీ గార్డెన్, ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్, మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.

News November 14, 2025

ADB: ఈనెల 19న బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు

image

ఆదిలాబాద్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-17 జిల్లాస్థాయి బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, సర్టిఫికెట్​లతో రిపోర్ట్ చేయాలని కోరారు. పాల్గొనేవారు తప్పనిసరిగా సొంతంగా క్రికెట్ కిట్, యూనిఫాం తీసుకురావాలని సూచించారు.

News November 13, 2025

బోథ్: రెండు రోజులు సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

image

AMC బోథ్ మార్కెట్‌లో సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. బోథ్ మార్కెట్‌లో అధిక మొత్తంలో పంట నిల్వ ఉండడంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 17 నుంచి యధావిధిగా కొనుగోళ్లు చేపడతామని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.