News February 20, 2025

క్రీడాకారులను అభినందించిన WGL కలెక్టర్

image

ఈనెల 18న హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బ్లైండ్ పార జూడో ఛాంపియన్షిప్‌లో వరంగల్‌కు చెందిన తొమ్మిది మంది క్రీడాకారులు బంగారు పథకం సాధించారు. వారిని గురువారం వరంగల్ కలెక్టర్ సత్య శారద అభినందించారు. ఈనెల 24 నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్రానికి జిల్లాకు పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సత్యవాణి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

వరంగల్: ఇక్కడి రోటి యమ ఫేమస్..!

image

ఉత్తరాది రుచులు ఇక్కడి యువతను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వలసదారులు వర్ధన్నపేటతో పాటు రాయపర్తి, వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి వెంట డాబాలను ఏర్పాటు చేసి అక్కడి రోటితో పాటు పలు కర్రీలు చేస్తూ రుచులు చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే వంటకాలు కావడంతో ప్రతి ఒక్కరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.

News July 5, 2025

నర్సంపేట: ఇళ్లలో చోరీ.. ఏడుగురు అరెస్ట్

image

నర్సంపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ అంకిత్ వివరాలు.. ఖానాపురం మండలానికి చెందిన రాజేశ్, నర్సంపేటకు అక్షయ్ కుమార్, అక్షయ్, సాయిరాం, ఉదయ్, విపిన్, సుబానిలు గ్రూప్‌గా ఏర్పడి డబ్బుల కోసం ఇళ్లల్లో దొంగతనం చేస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో బంగారాన్ని కుదువ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

News July 5, 2025

వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

image

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.