News November 26, 2024
క్రీడాకారులను సన్మానించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్

ఈ నెల 29 నుంచి డిసెంబర్ 4 వరకు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగే 22వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఉషూ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కర్నూలులోని తన ఛాంబర్లో ఎంపికైన క్రీడాకారులను సత్కరించారు. పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News December 22, 2025
సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి: కర్నూలు కలెక్టర్

ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ న్యూరల్ కామర్తో కలిసి పీజీఆర్ఎస్ ద్వారా వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల విభాగం (పీజీఆర్ఎస్) జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 21, 2025
జాతీయ స్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఈనెల 27 నుంచి 30 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరగబోయే 50వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ & జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈఓ విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడారు.
News December 20, 2025
10వ ఫలితాల పెంపునకు 361 పాఠశాలలకు మెంటార్లు: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లాలో 361 పాఠశాలలకు 361 మంది అధికారులను మెంటార్లుగా నియమించినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పటిష్ఠంగా అమలు చేసి ఈ ఏడాది 90శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. డ్రాపౌట్ అయిన 1,559 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావాలన్నారు. హాజరు, రోజువారీ పరీక్షలు, జవాబు పత్రాల పరిశీలనపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.


