News November 24, 2024
క్రీడాభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి: విశాఖ కలెక్టర్
విశాఖ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా సంఘాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవోతో పాటు ఒలింపిక్ సంఘం పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2024
IPL వేలంలో మన విశాఖ కుర్రాడు
ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విశాఖకు చెందిన కేఎస్ భరత్ రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. మరి మన విశాఖ జిల్లా కుర్రాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు? ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందని భావిస్తున్నారో? కామెంట్ చేయండి.
News November 24, 2024
భీమిలి: యువతి సూసైడ్.. వేధింపులే కారణం!
భీమిలి మం. మజ్జివలసకు చెందిన రాశి(22) అదే ప్రాంతానికి చెందిన రాజు (26) వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాశి విద్యా వాలంటీర్‌గా పనిచేస్తోంది. ప్రేమ పేరుతో రాజు ఆమెను వేధింపులకు గురిచేయగా ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఫోన్‌డేటా ఆధారంగా రాజును ఈనెల 22న అరెస్ట్ చేశారు.
News November 23, 2024
విశాఖ: 25, 26 తేదీల్లో పలు రైళ్లు రద్దు
ఈనెల 25న విజయవాడ-విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-విశాఖ-కాకినాడ మెము ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి పాసింజర్ రైలు రద్దు చేశామన్నారు. 26న విశాఖ గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.