News February 3, 2025
క్రీడా విజేతలను అభినందించిన మహబూబాబాద్ ఎస్పీ

కరీంనగర్ జిల్లాలో జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025లో పతకాలు సాధించిన మహబూబాబాద్ జిల్లా పోలీస్ క్రీడాకారులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
కడప జిల్లా కలెక్టర్కు సెలవులు మంజూరు.!

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈనెల 21 నుంచి 29 వరకు సెలవుపై వెళ్లనున్నారు. కాగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా JC అతిధిసింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ తిరిగి 29వ తేదీన విధుల్లో చేరనున్నారు.
News October 22, 2025
చిత్తూరు జిల్లాకు ఆరంజ్ అలర్ట్

చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లా అంతట మంగళవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
News October 22, 2025
బాపట్ల జిల్లాకు అతి భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఈ నెల 22 – 26 వరకు బాపట్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు. రేపల్లె డివిజన్ మండలాలు, నది పక్కన, తక్కువ ఎత్తులో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయానికి కంట్రోల్ రూమ్ ఫోన్ 08648-293795 నంబరుకు సంప్రదించాలన్నారు.