News December 11, 2024
క్రీడా సమాఖ్య పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ
వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో జరుగుతున్న క్రీడా సమాఖ్య పాఠశాల స్థాయి అండర్-14 వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ చూపుతున్నట్లు కోచ్ అల్లి నరేశ్ తెలిపారు. బాలుర విభాగంలో మొదటి మ్యాచ్ పంజాబ్(3-2)తో, రెండవ మ్యాచ్ ఢిల్లీ(3-0)తో విజయం సాధించినట్లు వివరించారు. విజయం పట్ల అధ్యక్షుడు నాగరాజు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రమేష్, కిషోర్, దేవానంద్, హరిత, పుష్పవేణి హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 13, 2025
సంక్రాంతి రైతన్న జీవితాల్లో వెలుగులు నింపాలి: కేసీఆర్
రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి అని మాజీ సీఎం KCR అన్నారు. ‘X’ వేదికగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన వల్లనే తెలంగాణలో వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాగుకు, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి రైతన్నల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
News January 13, 2025
మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం గం.8:30 AMవరకు నమోదైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని అందోల్, కోహిర్ 13.6 డిగ్రీలు, చోటకుర్, పుల్కల్ 14.0, నాల్కల్ 14.4, మెదక్ జిల్లాలో వెల్దుర్తి 14.6, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గ్ 15.2, టేక్మాల్ 15.4, రేగోడ్ 15.5, సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట్ భూంపల్లి 15.2, దుబ్బాక 15.3, మిర్దొడ్డి 15.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 13, 2025
MDK: వీధుల్లో భోగి మంటలు, రంగవల్లులు
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి మరీ రథం వల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి.