News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 11, 2026
KNR: ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం: సీపీ

సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని KNR CP గౌష్ ఆలం సూచించారు. విలువైన ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం, బ్యాంక్ లాకర్లలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఊరెళ్లే సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరారు. సోషల్ మీడియాలో పర్యటనల వివరాలు పంచుకోవద్దని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలన్నారు.
News January 11, 2026
కరీంనగర్: బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ

కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన రఫీక్ ఖాన్ రెండు రోజులకే బదిలీ అయ్యారు. జగిత్యాల వీఆర్ నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనను ఉన్నతాధికారులు సీసీఆర్బీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
News January 11, 2026
ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.


