News December 30, 2024
క్రైమ్ రేటుపై చర్చకు సిద్ధం: మోహన్ రెడ్డి
ఉనికి కోసమే కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత అబద్ధపు మాటలు చేస్తున్నారని రాష్ట్ర సహకార యునియన్ లిమిటెడ్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబాన్ని మించిన వారు రాష్ట్రంలో లేరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వ హయంలో క్రైమ్ రేట్ పెరిగిందో, తగ్గిందో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశామన్నారు.
Similar News
News January 17, 2025
లింగంపేట: బీడు భూములకు రైతుభరోసా రాకుండా చూడాలి: RDO
రైతు భరోసా సర్వేను ఎలాంటి తప్పులు జరగకుండా నిర్వహించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో గురువారం రైతు భరోసా సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధంగా చూడాలని AEOలకు, రెవెన్యూ అధికారులను సూచించారు. బీడు భూములకు రైతు భరోసా రాకుండా చూడాలన్నారు.
News January 16, 2025
నిజామాబాద్: మెగా రక్తదాన శిబిరంలో కలెక్టర్ ఆశిష్
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగంపేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై సమాజంలో ప్రతిఒక్కరికీ అవగాహన కలిగి ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News January 16, 2025
NZB: ఓ బిడ్డా.. నిజామాబాద్ మరో 30 ఏళ్లు నీ అడ్డా..!
రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన MP అర్వింద్‌కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ‘రాజకీయంలో ఎంతో మంది నాయకులను చూశాను కానీ అర్వింద్ లాంటి మొండి పట్టు ఉన్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాను. పసుపు బోర్డు సాధించిన అర్వింద్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఓ బిడ్డా.. నిజామాబాద్ మరో 30 ఏళ్ల నీ అడ్డా..! 68 ఏళ్ల పసుపు రైతు ధన్యవాదములు తెలుపుతున్నట్లు నగరంలో రైతు ఏర్పాటు చేసిన వెలిసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారింది.