News February 8, 2025

క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ.2.16 కోట్లు: జేసీ 

image

జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై శుక్రవారం సమీక్షించారు. ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు రూ 2.16 కోట్లు కేటాయించారన్నారు.

Similar News

News October 26, 2025

PDPL: అప్లికేషన్లు తగ్గినా.. ఆదాయం పెరిగింది..!

image

అదృష్టం ఎవరిని వరిస్తుందో తేలే గడియలు రాబోతున్నాయి. దేవతల పేర్లతో వేసిన టెండర్లను ఆయా దేవతలు దక్కిస్తాయో లేదా వెక్కిరిస్తాయే తేలేది రేపే. జిల్లాలో 74 మద్యం షాపులకు 1,507 దరఖాస్తులు రాగా, ఫీజుల రూపంలో రూ.45.21కోట్ల ఆదాయం వచ్చింది. PDPLలో 20 షాపులకు 442, సుల్తానాబాద్లో 15కి 305, రామగుండంలో 24కి 474, మంథనిలో 15కి 286 దరఖాస్తులొచ్చాయి. గతేడాది దరఖాస్తులు 2,020 వచ్చినా.. ఈ ఏడాది ఆదాయం మాత్రం పెరిగింది.

News October 26, 2025

కరీంనగర్: గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు

image

కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ గిరిజన యువతకు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ హైదరాబాద్ (డీఈఈటీ) ఆన్లైన్ వెబ్‌సైట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి సంగీత తెలిపారు. ఆసక్తిగల గిరిజన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News October 26, 2025

ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15వ ఫ్లోర్ నుంచి దూకి భర్త ఆత్మహత్య

image

భార్యతో గొడవల నేపథ్యంలో 15వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారో భర్త. ఫరిదాబాద్‌(Haryana)లో ఉండే యోగేశ్ కుమార్ 9 ఏళ్ల కిందట నేహాను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కూతురి(6)ని చూసుకోవడానికి ఇటీవల తల్లిని యోగేశ్ పిలిపించుకున్నారు. దీనిపై నేహా, ఆమె ఫ్యామిలీతో యోగేశ్‌కు గొడవలు జరిగాయి. తాజాగా మళ్లీ వాగ్వాదం జరిగి బిల్డింగ్ పైనుంచి అతడు దూకేశారు. నేహా సహా ఐదుగురిపై కేసు నమోదైంది.