News September 30, 2024
క్వింటా పత్తికి రూ.500 మద్దతు ధర పెంపు: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. HYDలో RR, KMM,VKB, MDCL సహా ఇతర జిల్లాలకు చెందిన అధికారులతో CCI సమావేశంలో పలు సూచనలు చేశారు. వారానికి 6 రోజులు కేంద్రాలు పని చేయనున్నాయని పేర్కొన్నారు. ఈసారి మద్దతు ధర రూ.500 పెరిగినందున కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News September 16, 2025
జాలిమూడి కుడి, ఎడమ కాలువల మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

మధిర జాలిమూడి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం రూ. 5.41 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులను విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మరమ్మతులు పూర్తయితే, ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని ఆశిస్తున్నారు.
News September 16, 2025
ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.
News September 16, 2025
ఖమ్మం: ఆమె ఆరోగ్యమే లక్ష్యం

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో 26 PHCలు, 4 UPHCలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు 10 క్యాంపుల చొప్పున 12రోజుల్లో 120 క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయనున్నారు.