News April 2, 2025
క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చిన నాగర్‌కర్నూల్ ఎస్పీ

వెల్దండ మండలంలోని కోట్రగేట్ సమీపంలో ఆటో బోల్తా పడి పలువురు గాయపడ్డారు. అటు నుంచి వెళ్తున్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెంటనే వాహనాన్ని ఆపి ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో పోలీసు వాహనాన్ని రప్పించి వాహనంలో గాయపడ్డ వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానికులు ఎస్పీని అభినందిస్తున్నారు.
Similar News
News December 4, 2025
ఆదిలాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్

ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుక హెలి ప్యాడ్‌లో ల్యాండ్ అయ్యారు. వెంటనే నేరుగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
News December 4, 2025
GNT: మారువేషంలో మార్చూరీని పరిశీలించిన సూపరింటెండెంట్.!

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.
News December 4, 2025
HYD: జలమండలి పరిధిలో 14.36 లక్షల కనెక్షన్లు

జలమండలి పరిధిలో 14.36 లక్షల నల్లా కలెక్షన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో 85% వరకు డొమెస్టిక్ క్యాటగిరి కనెక్షన్లు ఉండగా, మిగిలిన 15% వాణిజ్య, ఇండస్ట్రీయల్ తదితరాలు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 10 -15 వేల వరకు కొత్త కనెక్షన్లు మహానగర వ్యాప్తంగా మంజూరు అవుతున్నాయి. వాణిజ్యం అత్యధికంగా ఉన్నప్పటికీ క్యాటగిరిలో మాత్రం తక్కువ కనిపిస్తోందని జలమండలి అనుమానం వ్యక్తం చేసింది.


