News November 28, 2024

క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రి

image

రాష్ట్ర కార్మిక పారిశ్రామిక మంత్రి వాసంశెట్టి సుభాష్ విశాఖ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో జిల్లాకు చేరుకుంటారని మంత్రి కార్యదర్శి వెంకట సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అనకాపల్లి జిల్లా పరవాడ టాగూర్ ఫార్మా పరిశ్రమలో పర్యటించి ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకుంటారు. అనంతరం విశాఖలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.

Similar News

News November 16, 2025

కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

image

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు

News November 16, 2025

జగదాంబ జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

జగదాంబ జంక్షన్‌లోని బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.

News November 16, 2025

విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

image

జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్‌లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.