News December 17, 2024

క్షమాపణలు చెప్పిన మంత్రి కొలుసు

image

మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం క్షమాపణలు చెప్పారు. ఆదివారం నూజివీడులో జరిగిన కార్యక్రమంలో జోగి రమేశ్ ప్రత్యక్షమవ్వడంపై ఆయన మాట్లాడారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటే క్షమించాలని కోరారు. ఆ కార్యక్రమం పార్టీ పరంగా కాకుండా సామాజికపరంగా జరిగిందని తెలిపారు. తనను అక్కున చేర్చుకొని గౌరవించిన చంద్రబాబుకి క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు.

Similar News

News January 20, 2025

కైకలూరు: పాత కక్షలతో హత్య.. పట్టుకున్న పోలీసులు

image

పాత కక్షల కారణంగా పథకం ప్రకారం కాపుకాసి హత్య చేసిన నిందితుడు బోధనపు శ్రీనివాసరావును అరెస్టు చేసారని ఏలూరు డీఎస్పీ డి. శ్రావణకుమార్ తెలిపారు. ఆదివారం కైకలూరు సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. కొన్నిరోజుల క్రిందట కలిదిండి మండలం సంతోషపురం గ్రామ మాజీ సర్పంచ్ కాలువ నల్లయ్య హత్యకు గురయ్యారు. విచారణ చేపట్టి తక్కువ సమయంలో ఈ కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు.

News January 20, 2025

విజయవాడలో యువకుడి ఆత్మహత్య

image

విజయవాడ నగరంలోని రాధనగర్‌లో శనివారం వాచ్‌మెన్ గొర్లి శివ (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న శివను యజమాని పిలువగా పలకలేదు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

News January 20, 2025

విజయవాడ మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయవాడ మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.