News March 29, 2025
క్షయ వ్యాధి నియంత్రణలో విజయనగరానికి జాతీయ స్థాయి గుర్తింపు

క్షయ వ్యాధి నియంత్రణలో విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఈ వ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్థుల గుర్తింపులో జిల్లా ముందు వరుసలో నిలిచిందన్నారు. వ్యాధి నియంత్రణకై చేపట్టిన ప్రత్యేక వందరోజుల కార్యక్రమంలో దేశంలోనే అత్యధిక క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన జిల్లాగా విజయనగరం నిలిచినట్లు పేర్కొన్నారు. సిబ్బందిని అభినందించారు.
Similar News
News April 5, 2025
VZM: యువతిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకొని వచ్చి కత్తితో శనివారం దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గరివిడి పోలీసులు విచారణ చేపట్టారు.
News April 5, 2025
VZM: జిల్లాలో మూడు అన్న కాంటీన్లకు రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన క్యూఆర్ కోడ్ ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లాకు చెందిన మూడు అన్న క్యాంటీన్లు మెరుగైన ర్యాంకులను సాధించాయి. బొబ్బిలి ఆర్అండ్బీ ఆఫీసు సమీపంలోని అన్న క్యాంటీన్‌కు రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం, విజయనగరం ప్రకాశం పార్కులోని క్యాంటీన్‌కు ఏడో స్థానం, ఘోషా ఆసుపత్రిలోని అన్న క్యాంటిన్‌కు పదో స్థానం దక్కాయని కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు.
News April 5, 2025
బొండపల్లి: ఆన్లైన్ బెట్టింగ్.. ఏడుగురి అరెస్ట్

మండల కేంద్రమైన బొండపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యు.మహేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.