News March 24, 2025

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: రాహుల్ శర్మ

image

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించగలమన్నారు. సంక్రమిత వ్యాధుల్లో క్షయ ఒకటని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను హరించేస్తుందని తెలిపారు.

Similar News

News October 17, 2025

ఉపమాక బాలికను అభినందించిన గవర్నర్, మంత్రి

image

సూపర్ జీఎస్టీ 2.0 చిత్రలేఖనం పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఉపమాకకు చెందిన బాలిక కే.చైత్రిని గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్ ప్రశంసలు పొందింది. నక్కపల్లి గర్ల్స్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న కె.చైత్రిని సూపర్ జీఎస్టి 2.0 చిత్రలేఖనం పోటీల్లో మండల స్థాయి, జిల్లాస్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ బాలికను గురువారం కర్నూలులో గవర్నర్, మంత్రి అభినందించినట్టు హెచ్ఎం శ్రీలక్ష్మి చెప్పారు.

News October 17, 2025

బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతుంది: MP కావ్య

image

కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని ఎంపీ కడియం కావ్య అన్నారు. HNK కాంగ్రెస్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలను ఏకతాటికి తీసుకొచ్చి అందరితో కలిసిపోయే పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశంలో బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు.

News October 17, 2025

నిర్మల్: ఇవాళ ఒక్కరోజే 160 దరఖాస్తులు

image

జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తులు జోరుగా సాగుతున్నాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. శనివారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడవు ముగుస్తుందన్నారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 160 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 360 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల దరఖాస్తులలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.