News February 25, 2025
క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యం: కోటాచలం

సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ల్యాబ్ టెక్నీషియన్లు, టీబీ సూపర్వైజర్లకు DMHO డాక్టర్ కోటాచలం మంత్లీ రివ్యూ మీటింగ్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. నిక్షయ శిబిర్ (వంద రోజుల్లో టీబి నిర్మూలన)లో భాగంగా రోగులను గుర్తించి అవగాహన కల్పించాలని సూచించారు. తేమడుతో కూడిన దగ్గు రెండు వారాలకు మించి ఉంటే పరీక్షలు చేయించాలని అన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 26, 2025
విశాఖలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

విశాఖలో దారి దోపిడీ ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిబ్రవరి 22న ఉదయం మైలపల్లి చందర్రావు అనే వ్యక్తిని ముగ్గురు బైక్‌పై వచ్చి అడ్డుకున్నారు. అతని నుంచి రూ.350 నగదు, సెల్ ఫోన్ తీసుకొని తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. నిందితులు తీడా మోనేష్ బాబు(19), మరో ఇద్దరు మైనర్ యువకుల(17)ను అరెస్ట్ చేసి జువెనైల్ హోం, రిమాండ్‌కు తరలించారు.
News February 26, 2025
27న విద్యాసంస్థలకు సెలవు: డీఈఓ

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా కమిషనర్ సెలవు ప్రకటించినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, ఎంఈఓలు, అన్ని విద్యా సంస్థలకు దీనిపై సర్క్యులర్ అందించినట్లు వివరించారు.
News February 26, 2025
ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉ.6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జకర్తా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 2018లో సులవేసిలో భారీ భూకంపంతో 2,200 మంది, 2021 జనవరిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నిన్న కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది.