News April 8, 2025
క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి: DMHO

రఘునాథపాలెం: క్షయ వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎంహెచ్వో డా. కళావతి బాయ్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు విధి నిర్వహణ పై జిల్లా కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన పెంచాలన్నారు.
Similar News
News October 31, 2025
రక్తదాన శిబిరానికి భారీ స్పందన: సీపీ సునీల్ దత్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 1500 మంది దాతల నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
News October 31, 2025
సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News October 31, 2025
నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.


