News March 19, 2024
క్షుణంగా తనిఖీలు చేపట్టాలి: కలెక్టర్ హరిచందన

NLG:పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎఫ్ఎస్టి,ఎస్ఎస్టి బృందాలు తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. ఉదయాదిత్య భవన్లో ఎఫ్ ఎస్ టి,ఎస్ ఎస్ టి బృందాలకుద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎఫ్ ఎస్ టి బృందాలు ఒకే చోట ఉండకుండా క్షేత్రస్థాయిలో ఒక చోట నుండి మరోచోటికి వెళ్తూ తనిఖీలు నిర్వహించాలని అన్నారు.
Similar News
News November 27, 2025
ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, బెదిరింపులు, ఇతర అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News November 27, 2025
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు

నల్గొండ: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి కొర్ర లక్ష్మీ గురువారం పలు కేంద్రాలను సందర్శించారు. నార్కట్పల్లి గ్రామ పంచాయతీ, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 27, 2025
NLG: ఇక్కడ మహిళలే కీలకం

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు 28 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంపగుత్త ఓట్ల కోసం కులసంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.


