News October 4, 2024
క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా ఓటరు జాబితా సర్వే: కమిషనర్

ఓటరు జాబితా సవరణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు బీఎల్ఓలను ఆదేశించారు. గురువారం నగరపాలక నూతన కౌన్సిల్ హాలులో బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. ఫాం 6, 7, 8ల పూరింపులపై అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కొత్త ఓటుకు ధరకాస్తు, చనిపోయినవారి ఓటు తొలగింపు, సవరణలు తప్పొప్పులు లేకుండా ప్రక్రియ చేయాలన్నారు.
Similar News
News October 19, 2025
కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

కర్నూలు రేంజ్లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News October 19, 2025
లిక్కర్ షాపుల కోసం రూ.4.5 కోట్లు పెట్టిన కర్నూలు మహిళ

కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తెలంగాణలోని 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం ఆమె రూ.4.5 కోట్లు చెల్లించింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆమెకు ఏపీలోనూ ఎక్కువ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ ఇవ్వనున్నారు.
News October 19, 2025
జిల్లా కలెక్టర్ డా.సిరి హెచ్చరిక.!

దీపావళి సందర్భంగా కేటాయించిన ప్రదేశాలలోనే టపాకాయలు విక్రయించాలని, నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని శనివారం కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చే సమయంలో ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.