News November 8, 2024

’క‘ సినిమాలో నల్లమల బాల నటుడు

image

ఉప్పునుంతల మండలం దేవదారికుంట గ్రామానికి చెందిన కాట్రావత్ రవీందర్ కుమారుడు కాట్రావత్ హర్షవర్ధన్ ’క‘ చలనచిత్రంలో చిన్నప్పటి హీరోపాత్ర పోషించాడు. ఈ బాల్య నటుడు తన చిన్న వయసులో 4 సినిమాల్లో నటించాడు. నేడు మరోసారి ’క‘ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. హర్షవర్ధన్, ముందు ముందు ఇంకా మరెన్నో సినిమాల్లో నటిస్తూ గొప్ప నటుడిగా పేరుతెచ్చుకోవాలని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 9, 2024

MBNR: జోగులాంబ ఆలయానికి భారీగా ఆదాయం

image

అలంపూర్ ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నేడు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ.1,06,04,436 సమకూరింది. ఈ ఆదాయం ఐదు నెలలు తర్వాత లెక్కింపులో ఇంత భారీ ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

News December 9, 2024

కొడంగల్ యువకుడికి రూ.2 కోట్ల వేతనం

image

కొడంగల్ యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ. 2కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో అప్లయిడ్ సైంటిస్ట్‌గా బొంరాస్‌పేట మం. తుంకిమెట్ల యువకుడు సయ్యద్ అర్బజ్ ఖురేషి(26) సెలక్ట్ అయ్యారు. పట్నా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఇతడు USAలోని UMASS యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్‌లో MS పట్టా పొందారు.

News December 9, 2024

తెలంగాణ తల్లి తొలివిగ్రహం.. మన పాలమూరులోనే !

image

రాహుల్ గాంధీ జోడోయాత్ర 2022 OCT 23న తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా కర్ణాటక సరిహద్దు టై రోడ్డులో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాత్ర 3 రోజుల విరామం తర్వాత OCT 27న నారాయణపేట జిల్లాలో పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో MBNR జిల్లా సరిహద్దు సీసీకుంట మం. లాల్ కోట ఎక్స్ రోడ్‌లో మరో విగ్రహం ఆవిష్కరించారు. ఇప్పుడు అదే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.