News October 22, 2024
ఖచ్చితమైన నివేదికతో సమావేశానికి హాజరు కావాలి: కలెక్టర్
ఖమ్మం: రేపటి దిశ కమిటీ సమావేశానికి అధికారులు ఖచ్చితమైన నివేదికలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. రేపటి దిశ కమిటీ సమావేశం సన్నద్ధం పై కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సోమవారం సమీక్షించారు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు, ఖర్చు పెట్టిన నిధులు, చెల్లింపులకు సంబంధించి నమోదుచేసిన మొత్తం, మిగులు నిధుల వివరాలు చూపాలని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2024
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొంగులేటి
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, కానీ రైతుల ముసుగులో అధికారులపై దాడులు చేయడం సరికాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.
News November 14, 2024
ఖమ్మంలో గ్రూప్ -III పరీక్షకు 87 కేంద్రాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కమిషన్ ఛైర్మన్ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కమిషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 27,984 మంది పరీక్ష రాస్తున్నరని వారి కోసం 87 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాల రెవెన్యూ అధికారి రాజేశ్వరి, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.
News November 14, 2024
జూలూరుపాడు: యువతి హత్య UPDATE
జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో స్వాతి (28)ని భర్త భానోత్ భద్రం హత్య చేసి <<14604036>>పత్తి <<>>చేనులో పాతి పెట్టిన సంగతి తెలిసిందే. నిందితుడి వివరాల ప్రకారం.. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ నెల 9న స్వాతిని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం అతని తల్లి సహాయంతో ఓ సంచిలో మూటగట్టి చేనులో పాతిపెట్టినట్లు తెలిపాడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.