News August 5, 2024
ఖడ్గవలస: ప్రధాన రహదారిపై ఏనుగుల గుంపు
పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారిలోని ఖడ్గవలస కూడలిలో ఉన్న రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప రహదారుల పైకి రావద్దని సూచించారు.
Similar News
News September 15, 2024
వందే భారత్ ట్రైన్‌కు పార్వతీపురంలో హాల్ట్
నేటినుంచి ప్రారంభమయ్యే దుర్గ్-విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ రైలుకు పార్వతీపురంలో హాల్ట్ కల్పించారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో విజయనగరం ఒకటే హాల్ట్ ఇచ్చారు. దీంతో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విశాఖపట్నం డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, కేంద్ర రైల్వే సహాయ మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీంతో జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో కూడా హాల్ట్ కల్పించారు.
News September 15, 2024
సరియా జలపాతంలో విజయనగరం యువకుడి గల్లంతు
అనంతగిరి మండలంలోని సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. SI టి.మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పైడి భీమవరానికి చెందిన లంకా సాయికుమార్(30) విశాఖలోని దైవక్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. ఈక్రమంలో సరియా జలపాతం వద్దకు శనివారం వెళ్లగా.. అక్కడ సాయికుమార్ కాలు జారి నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఇండియన్ నేవీ ఉద్యోగి గమనించి సాయిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.
News September 14, 2024
పైడితల్లి జాతరకు సీఎంకు ఆహ్వానం పలికిని విజయనగరం ఎంపీ
వచ్చే నెల 15న జరగనున్న విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి జాతరకు రావాలంటూ సీఎం చంద్రబాబును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. శనివారం ఢిల్లీలో బాబును కలిసిన ఎంపీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పైడితల్లి అమ్మవారిని సీఎం భార్య భువనేశ్వరి దర్శించుకున్న రోజునే చంద్రబాబుకు బెయిల్ లభించిందన్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు.