News June 3, 2024
ఖమ్మంకి 18, మిగతా చోట్ల 14 టేబుల్స్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్ సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఖమ్మం నియోజకవర్గానికి 18, మిగతా చోట్ల 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని అధికారులు నిర్ణయించింది. మహబూబా బాద్ లోక్‌సభ స్థానం ఓట్లను మహబూబాబాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో, ఖమ్మం లోక్‌సభ స్థానం ఓట్లను పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు.
Similar News
News September 13, 2024
ఖమ్మం: ఈనెల 16న వైన్ షాపులు బంద్
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 16న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లను మూసివేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. 16న ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల ఆదేశాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
News September 12, 2024
గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు: CP
ఖమ్మం: గణేష్ నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ చిన్న సంఘటనకు అస్కారం లేకుండా భక్తులు, సందర్శకులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని, అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
News September 12, 2024
మున్నేరు ముంపును పరిశీలించిన కేంద్ర బృందం
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహ కల్పలో వరద ముంపు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు నివేదికను కోరారు. కేంద్ర బృందం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.