News July 8, 2024

‘ఖమ్మం,భద్రాద్రి జిల్లాల్లో రేపు సీత్లా పండుగ’

image

వర్షాకాలం సీజన్లో తొలకరి జల్లులు పడుతున్నప్పుడు తండాల్లో లంబాడా గిరిజనులు జరుపుకునే మొదటి పండుగ సీత్లా పండుగ. కాగా ఖమ్మం, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న తండాల్లో మంగళవారం సీత్లా పండుగ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే తండాల్లో ఉన్న సీత్లా భవాని వద్ద గిరిజనులు తగు ఏర్పాట్లు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని లంబాడా గిరిజనులు ప్రతి ఏటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Similar News

News October 14, 2025

15న సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకానికి రాత పరీక్ష

image

రెండు సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకానికి ఈనెల 15న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటలలోగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.

News October 14, 2025

‘పంట కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి’

image

జిల్లాలో వానాకాలం సాగు ధాన్యం, పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం ధాన్యం, పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని పేర్కొన్నారు.

News October 14, 2025

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలి: కలెక్టర్

image

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సమీక్షించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చాలా తక్కువగా యావరేజ్ పాల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో రివ్యూ చేయాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు.