News September 11, 2024
ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ కళాశాల మోడల్ కెరీర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి తెలిపారు. స్పందన స్పీహూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నందు ఖాళీగా ఉన్న 100 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-29 ఏళ్ళు కలిగి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు అన్నారు. ఉ.10 గంటలకు జరిగే జాబ్ మేళాలో విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.
Similar News
News February 23, 2026
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 10 వరకు జరిగే ఈ పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీస్ శాఖకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.
News February 23, 2026
ఏఐ వినియోగంతో మెరుగైన ఫలితాలు: కలెక్టర్ అనుదీప్

జిల్లా పరిపాలనలో ఏఐ సాంకేతికత ‘క్లాడ్’ వాడకం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఎక్సెల్ షీట్లు, నివేదికల తయారీలో ఏఐని ఎలా ఉపయోగించాలో వివరించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు విధి నిర్వహణలో ఏఐ టూల్స్ వినియోగించాలని కోరారు.
News February 23, 2026
‘దిశ’ సమావేశానికి అధికారులు సిద్ధంగా రావాలి: కలెక్టర్

ఈ నెల 27న నిర్వహించే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరిపాలన అంశాలపై సమీక్షించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ.10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని అధికారులను సూచించారు.


