News December 16, 2024
ఖమ్మంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల

స్వర్గీయ NTR ఆశయ సాధనకు కృషిచేద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. NTR అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన NTR సినీ వజ్రోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పొట్ల నాగేశ్వరావు, డా.రామనాథం, మాజీ MLC బాలసాని పాల్గొన్నారు.
Similar News
News November 3, 2025
పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో హెడ్ మాస్టర్‌లు, మున్సిపల్ కమీషనర్‌లతో ఆమె సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ స్కూల్స్ మంజూరైన నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.
News November 3, 2025
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి, రహదారి, స్వయం ఉపాధి, జీతం వంటి పలు సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News November 2, 2025
సెలవులపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. నేటి నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించనున్నారు.


