News January 5, 2025

ఖమ్మంలో ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం

image

ఖమ్మం నగరంలో ఆదివారం ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాముల అధ్యక్షతన జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 26 సంఘాల సంఘటిత, అసంఘటితరంగా జిల్లా బాధ్యులు ఐఎన్టీయూసీ మండల ప్రెసిడెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువనాయకులు తుమ్మల యుగంధర్, ఐఎన్టీయూసీ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్ జలీల్ పాల్గొన్నారు.

Similar News

News January 5, 2026

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సత్తుపల్లి, వైరా, ఖమ్మం అర్బన్ ప్రాంతాల నుంచి భూ వివాదాలు, పర్యావరణం, మున్సిపల్ సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీటిని ఆయా విభాగాలకు బదిలీ చేస్తూ.. నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 5, 2026

ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత శిక్షణ

image

ఖమ్మం ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు. జావా, పైథాన్, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, బూట్‌స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో నైపుణ్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 13వ తేదీ లోపు ఐటీ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

News January 5, 2026

KMM: అవినీతి రహిత సేవలే లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 దశల్లో 94 కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా మరో 10 సమీకృత భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ సంస్కరణల వల్ల అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు.