News June 5, 2024

ఖమ్మంలో కాంగ్రెస్‌కు తొలి గెలుపు

image

ఖమ్మం ఎంపీ స్థానాన్ని 2014లో వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన పొంగులేటి గెలిచారు. 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ మెజార్టీతో ఖమ్మంలో పాగా వేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లైంది.

Similar News

News December 10, 2024

ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి:కలెక్టర్ 

image

ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని సోమవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్‌లో నమోదు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

News December 9, 2024

‘ఖమ్మం జిల్లాలోని రైల్వే స్టేషన్ సమస్యలు పరిష్కారించాలి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్టేషన్లలో నెలకొన్న రైల్వే సంబంధిత సమస్యలపై ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతి అందజేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్ రావులు రైల్వే మంత్రిని కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.

News December 9, 2024

REWIND: మహాలక్ష్మి పథకంకి ఏడాది పూర్తి

image

మహాలక్ష్మి పథకం అమలై ఏడాది అవుతోంది. గతేడాది ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం పాతబస్టాండ్‌లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు.