News July 7, 2024

ఖమ్మంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం

image

నిద్రమాత్రలు మింగి జిల్లా టీఎన్జీవో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అబ్దుల్ హాసన్ తన ఇంట్లో భారీ మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంతకాల ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్టైన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

Similar News

News November 12, 2025

వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

image

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్‌లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.

News November 12, 2025

ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్‌లైన్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.

News November 12, 2025

ఖమ్మం: బోనస్‌పై అనుమానం.. కొనుగోళ్లలో జాప్యం

image

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో విక్రయించిన ధాన్యానికి బోనస్ ఇంకా జమ కాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. మద్దతు ధరతో పాటు బోనస్ రావాలంటే కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాల్సి ఉన్నా, బోనస్‌పై అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.