News April 4, 2024
ఖమ్మంలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్.. 185మంది డుమ్మా

టెన్త్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైంది. కాగా డ్యూటీ ఆర్డర్లు తీసుకున్న వారిలో తొలిరోజు సమాచారం ఇవ్వకుండానే 185 మందికి పైగా విధులకు గైర్హాజరయ్యారు. డీఈవో సోమశేఖర శర్మ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇచ్చారు.
Similar News
News February 7, 2026
మున్సిపల్ ఎన్నికలు.. ఖమ్మం సీపీ హెచ్చరిక

ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9 నుంచి 13 వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో BNSS 163 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఐదుగురికి మించి గుంపులుగా చేరడం, ఊరేగింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిషేధమన్నారు. డబ్బు, మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News February 7, 2026
ఖమ్మం: రేపే పోస్టల్ బ్యాలెట్ వినియోగం

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. ఖమ్మం రూరల్, మధిర MPDO కార్యాలయాలు, వైరా MRO కార్యాలయం, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News February 7, 2026
మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


