News April 18, 2024

ఖమ్మంలో తొలిరోజు ఒక నామినేషన్ దాఖలు

image

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి రోజు ఒక నామినేషన్ స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17- ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆధార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

Similar News

News October 1, 2024

పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఖమ్మం, భద్రాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

ధాన్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి

image

ఖమ్మం జిల్లాలో జరిగిన సీఎంఆర్ ధాన్యం అవకతవకలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. అవకతవకలకు పాల్పడిన ఆయా మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ను ఆదేశించారు. ధాన్యం పక్కదారి పట్టించిన అధికారులపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పలు మిల్లులు ప్రభుత్వా ధాన్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

News October 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటించడం జరిగిందని చెప్పారు. తిరిగి ఈనెల 3 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. కావున ఈ విషయాన్ని రైతులు గమనించి రేపు మార్కెట్ కు పంటను తీసుకురావద్దని సూచించారు.