News August 4, 2024
ఖమ్మంలో దోస్తానా అంటే ప్రాణం!

దోస్తానా అంటే ఖమ్మం వాసులు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
Similar News
News October 30, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగిన నేపథ్యంలో (రేపు) శుక్రవారం తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్ను తిరిగి రేపు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కావున రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.
News October 30, 2025
ఖమ్మంలో అర్ధరాత్రి హై అలర్ట్

మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలలో అర్ధరాత్రి పోలీసులు, మున్సిపల్ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మున్నేరు ప్రవాహనం పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు 17 అడుగుల వద్ద ఉన్న వాగు అర్ధరాత్రి 22 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని బొక్కలగడ్డ, మోతీ నగర్ ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. తెల్లవారుజామున 5 గంటలకు 23 అడుగులకు చేరుకుంది.
News October 30, 2025
ఖమ్మం: అంగన్వాడీల్లో కరువైన పర్యవేక్షణ..!

జిల్లాలో గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధికారుల పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం పెట్టడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కేంద్రాలపై దృష్టి సారించి, మెరుగైన సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


