News August 31, 2024

ఖమ్మంలో నాలాలూ కబ్జా!

image

ఖమ్మం జిల్లాలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మాత్రమే కాదు, నాలాలను ఆక్రమించారని స్థానికులు అంటున్నారు. దీంతో కొన్ని కాలువలు ఆనవాళ్లు కోల్పోగా, మరికొన్నింటికి ఇరువైపుల కట్టడాలు పూర్తయ్యాయి. దీంతో వరద చెరువుల్లోకి వెళ్లడం లేదు. దీంతో పలు ప్రాంతాలు కుంటల్లా మారుతున్నాయి. చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో అవి కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Similar News

News October 7, 2024

అశ్వారావుపేట: కరెన్సీ నోట్లతో మండపం

image

అశ్వారావుపేట మండలం నాయీబ్రహ్మణ సంఘం బజారులోని నాయీబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపాన్ని అందంగా అలంకరించారు. 4వ రోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏకంగా కొన్ని లక్షల ఫేక్ కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. మండపం మొత్తం కరెన్సీ నోట్లతో కళకళలాడుతోంది.

News October 7, 2024

‘డీఎస్సీ 2008 ఏజెన్సీ అభ్యర్థుల జాబితా సవరించాలి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్సీ 2008 అర్హుల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని, వాటిని సవరించి కొత్త జాబితా విడుదల చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకులు కల్తి రాంప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కారేపల్లిలో జరిగిన డీఎస్సీ 2008 బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ఏరియా గిరిజన అభ్యర్థుల లిస్టుల తయారీలో జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించాలన్నారు.

News October 6, 2024

రఘునాథపాలెం: బతుకమ్మ పూల కోసం వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి

image

రఘునాథపాలెం మండలం పాపడపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఆదివారం మిట్టపల్లి చరణ్ తేజ్ బతుకమ్మ కోసం డాబాపైన పూలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తాకి షాక్‌‌కు గురై మృతి చెందాడు. పలుమార్లు విద్యుత్ అధికారులకు వైర్లు కిందకు ఉన్నాయని చెప్పిన పట్టించుకొలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.