News April 13, 2025

ఖమ్మంలో నేడు ఎంపీ పర్యటన వివరాలు

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వైద్యుల పునశ్చరణ తరగతుల శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి లో పద్మశ్రీ వనజీవి రామయ్య అంతిమయాత్రలో పాల్గొంటారని చెప్పారు

Similar News

News December 6, 2025

గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్ హబ్‌గా ఇండియా

image

రక్షణ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్ ముందడుగు వేస్తోంది. 2029లో ₹3Tల మేర ఉత్పత్తి చేయడంతో పాటు ₹50,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇండియన్ ARMY, NAVY, AIRFORCEకు సంబంధించిన ₹670 Bల ప్రపోజల్‌ను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. FY27లో రక్షణరంగ బడ్జెట్‌ 20% మేర పెరగవచ్చని ఇప్పటికే రక్షణ శాఖ సంకేతాలు పంపింది. దీంతో రక్షణ ఉత్పత్తులు ఊపందుకోనున్నాయి.

News December 6, 2025

VJA: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఇద్దరు వ్యాపారుల పాత్రపై దర్యాప్తు

image

హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విజయవాడలో ఇద్దరు వ్యాపారుల పేర్లు తెరమీదకి వచ్చాయి. వీరు మావోయిస్టుల మద్దతుదారులా? లేక పోలీసుల ఇన్‌ఫార్మర్లా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెనమలూరులో పట్టుబడిన మావోయిస్టులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.

News December 6, 2025

టాస్ గెలిచిన భారత్

image

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.

భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.