News March 6, 2025
ఖమ్మంలో నేడు జాబ్ మేళా

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు గురువారం టేకులపల్లి మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటీఐ)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వేతనం రూ.13వేలు ఉంటుందని, మొత్తం 500 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: కలెక్టర్

ఖమ్మం నగరంలో మున్నేరు నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 90 కుటుంబాల పరిధిలో 227 సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వారికి అవసరమైన ఆహారం, పారిశుధ్యం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఆస్తి నష్టం, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తుపాన్ వల్ల 24 రోడ్లపై నీటి ప్రవాహం రావడం వల్ల రాకపోకలు నిలిపి వేశామని పేర్కొన్నారు.
News October 30, 2025
క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: సీఎం

ఖమ్మం: మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
News October 30, 2025
పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం పరిశీలించారు. నయాబజార్ స్కూల్, జూనియర్ కళాశాల శిబిరాల్లోని వసతులు, భోజనం నాణ్యత, హెల్త్ క్యాంప్ల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ఇబ్బంది లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


