News April 4, 2025
ఖమ్మంలో నేడు మంత్రి తుమ్మల పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరావు శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మేయర్ పునకోల్లు నీరజతో కలిసి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.
Similar News
News April 18, 2025
ఖమ్మం: ఫైనాన్స్ వేధింపులు.. యువకుడి SUICIDE

ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) బోనకల్(M) గోవిందపురం(ఎల్)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా గత కొద్ది రోజుల క్రితం ఓ కంపెనీలో ఫైనాన్స్ తీసుకోగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో మనస్తాపం చెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు. మృతుడి భార్య ఠాణాలో ఫిర్యాదు చేశారు.
News April 18, 2025
ఖమ్మం: CMRF గందరగోళం.. ఆసుపత్రులకు నోటీసులు

పేదలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి బిల్లులను ఖమ్మంలోని పలు ఆసుపత్రులు నకిలీ బిల్లులు సృష్టించి రూ.లక్షల విలువ గల CMRF చెక్కులను కాజేశాయి. ఈ అంశంపై కొద్దినెలల క్రితం సీఎంఓకు అందిన ఫిర్యాదుతో పలు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నేడు తాజాగా ఆ ఆసుపత్రులకు నోటీసులు పంపి, రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. పేదలకు అందాల్సిన పథకం నిర్వీర్యం అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.
News April 18, 2025
ఖమ్మం: అనుమానస్పద స్థితిలో బావిలో బాలుడి మృతదేహం

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.