News April 29, 2024

ఖమ్మంలో పాగా వేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నం

image

ఖమ్మం సిట్టింగ్‌ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును మరోసారి బరిలో దించింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్‌, తాతా మధు, రేగా కాంతారావు, తదితరులు ప్రచార బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. గతంలోనూ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటకపోయినా ఎంపీ ఎన్నికల్లో గెలిచామని ఈసారీ అలాగే జరగబోతుందని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

Similar News

News December 9, 2025

ఖమ్మం: రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్ష జరిగింది. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2025

తొలి విడత ఎన్నికలకు భారీ భద్రత: ఖమ్మం సీపీ

image

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నిక కోసం 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 953కేసుల్లో 6,403 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.12 లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. 16 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు.