News December 23, 2024
ఖమ్మంలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం

ఖమ్మం జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై ఖమ్మంలోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.
Similar News
News December 4, 2025
ఖమ్మం: స్కూటీని ఢీకొన్న లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్

ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. డోర్నకల్కు చెందిన మునగల వీరభద్రం(55) స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
News December 4, 2025
ఖమ్మం: కేంద్రమంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎంపీ

తెలంగాణలో పెండింగ్లో ఉన్న పలు జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలని, నిర్మాణ దశలో ఉన్న రహదారులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాజ్యసభ ఎంపి వద్దిరాజు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో కలిసి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన గడ్కరీకి సమస్యలను పరిష్కారిస్తామని హామినిచ్చారు.
News December 4, 2025
అటవీ భూముల ఆక్రమణను అనుమతించవద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని అటవీ భూముల ఆక్రమణకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్, DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో కలిసి పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.


