News July 12, 2024

ఖమ్మంలో బయటపడ్డ ఏఆర్ కానిస్టేబుల్ రాసలీలలు..!

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఏడాది క్రితం కోర్టు విషయంలో త్రివేణి అనే మహిళ కానిస్టేబుల్‌కు పరిచమైంది. చెల్లి అంటూ సదరు మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల త్రివేణిపై అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో త్రివేణి భర్త పోలీసులను ఆశ్రయించారు. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Similar News

News October 15, 2024

కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News October 15, 2024

నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. SHARE IT

News October 15, 2024

ఖమ్మం: ఓ పెయింటర్ ఆవేదన..!

image

ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో రోజువారీ కూలీలు, పెయింటింగ్ పనులు చేసేవారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో పెయింటర్ చిర్ర సురేశ్ మాట్లాడుతూ.. 2 నెలల నుంచి నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్నాయని, వంట నూనె, వెల్లుల్లి, టమాట ఇలా అన్నింటి రేట్లు పెరిగిపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని స్థితి తమదని, రేట్లు తగ్గించాలని కోరారు.