News April 25, 2024
ఖమ్మంలో మాజీ మంత్రి హరీశ్ రావు హెలికాఫ్టర్ చెకింగ్

ఖమ్మం BRS ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రచార కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వచ్చిన హరీష్ రావు హెలికాప్టర్ను సర్దార్ పటేల్ స్టేడియంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి వస్తువులు గుర్తించలేదని తెలిపారు.
Similar News
News November 17, 2025
లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం: CP

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు-605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా రూ.92,45,636 బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.
News November 16, 2025
స్థిరాస్తి లాటరీల మోసం.. అధికారులు దృష్టి సారించాలి

ఖమ్మం జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘1000 కట్టు-ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత ప్రకటనలతో లాటరీలు నిర్వహిస్తూ ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆర్థిక మోసాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమాయక ప్రజలను ఈ మోసాల నుంచి రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
News November 16, 2025
ఖమ్మం: అంగన్వాడీల్లో కనిపించని సమయపాలన..

జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బదులు ఆలస్యంగా కేంద్రాన్ని తెరవడం, అలాగే సాయంత్రం 4 గంటలకు ముందే 3 గంటలకే ఇంటికి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ వెంటనే దృష్టి సారించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


